అఖండ 2లో బాలయ్య సరికొత్త లుక్‌ – అఘోర పాత్ర ముగిసింది!

Balakrishna Aghora Role in Akhanda 2

నటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న “అఖండ-2” శివతాండవం షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. మొదటి భాగంలో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న అఘోర పాత్రను, ఈ సీక్వెల్‌లో మరింత పవర్‌ఫుల్‌గా చూపించనున్నారని చిత్రబృందం తెలిపింది. ప్రయాగ్ రాజ్ కుంభమేళా వంటి ప్రత్యేక లొకేషన్లలో కీలక సన్నివేశాలు ఇప్పటికే చిత్రీకరించబడ్డాయి. అఘోర పాత్రకు సంబంధించిన టాకీ పార్ట్ పూర్తయినట్టు తాజా సమాచారం.

తదుపరి షెడ్యూల్‌లో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసే రెండో పాత్రపై ఫోకస్ చేస్తూ హైదరాబాదులోని ఇంటీరియర్ సెట్స్‌లో షూటింగ్ జరగనుంది. ఇందులో ఎక్కువ భాగం విలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో ఉంటుందని, అవసరానికి అనుగుణంగా సెట్లు వేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. బోయపాటి శ్రీను జూన్ చివరినాటికి చిత్రీకరణ పూర్తి చేసి, సెప్టెంబర్‌లో విడుదల చేయాలనే లక్ష్యంతో ఉన్నారు.

సంగీత దర్శకుడు తమన్ ఇప్పటికే తన పనిని పూర్తి చేశారు. పాటల చిత్రీకరణ కూడా త్వరలో ప్రారంభమవుతుంది. అఖండ-2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి, ఇక బాలయ్య అఘోర పాత్ర తరువాత ద్విపాత్రాభినయంతో ఏ విధంగా మెప్పిస్తాడో చూడాలి!

Read More

One thought on “అఖండ 2లో బాలయ్య సరికొత్త లుక్‌ – అఘోర పాత్ర ముగిసింది!

Comments are closed.