పాడుతా తీయగా కార్యక్రమంపై సింగర్ ప్రవస్తి చేసిన ఆరోపణలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. షోలో జడ్జీలుగా ఉన్న కీరవాణి, సునీత, చంద్రబోస్‌లపై ఆమె తీవ్రమైన విమర్శలు చేశారు. అన్యాయంగా ఎలిమినేట్ చేయడమే కాకుండా, బాడీ షేమింగ్ కూడా జరిగిందని ప్రవస్తి ఆరోపించింది.
ఈ ఆరోపణలపై సింగర్ సునీత స్పందిస్తూ వీడియో విడుదల చేశారు. చిన్నప్పటి నుంచి ప్రవస్తిపై తనకు ఆత్మీయత ఉందని, కానీ ఇప్పుడు ఆమె చేస్తున్న ఆరోపణలు తనను బాధించాయని చెప్పారు. షో ప్రాసెస్, రూల్స్ గురించి స్పష్టంగా తెలియజెప్పాలని సునీత పేర్కొన్నారు. ప్రవస్తికి ఎదురైన అన్యాయం లేదని, అనవసరంగా బయట విమర్శలు చేయడం తప్పుడు వ్యవహారమని పేర్కొన్నారు.
ప్రవస్తి చేసిన ఆరోపణలపై సునీత గట్టి సమాధానం ఇచ్చారు. ఎలిమినేషన్ ప్రక్రియలో సింగర్స్ ఎంచుకునే పాటలకు సంబంధించిన హక్కులు, నియమాలు కూడా ఉండటాన్ని గుర్తు చేశారు. ఓటమిని అంగీకరించడం ధైర్యమని, జీవితం లో ముందుకు సాగాలంటే గౌరవం అవసరమని సూచించారు.
ప్రస్తుతం సునీత విడుదల చేసిన ఈ క్లారిఫికేషన్ వీడియో నెట్టింట వేగంగా వైరల్ అవుతోంది. పాడుతా తీయగా షోపై జరిగిన ఈ వివాదం సినీ రంగంలోనూ, సంగీత ప్రేమికుల్లోనూ పెద్ద చర్చకు దారితీసింది.
సింగర్ ప్రవస్తి వివాదంపై సింగర్ సునీత స్పెషల్ వీడియో….
— TeluguOne (@Theteluguone) April 22, 2025
SP Balasubrahmanyam గారు నిన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు….
ప్రవస్తి నీకు 1⃣9⃣ సంవత్సరాలు… ఇప్పుడు ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే బాగోదు….
ప్రజలకు జరిగిన అన్నీ విషయాలు చెప్పు… కొన్ని చెప్పి కొన్ని దాచుకోమాకు
ప్రవస్తి… pic.twitter.com/OSzscTNa8z

One thought on “ప్రవస్తి ఆరోపణలకు సునీత కౌంటర్: షో ప్రక్రియపై క్లారిటీ”
Comments are closed.