ఈవెంట్‌లకు గుడ్‌బై? తారక్ కొత్త నిర్ణయం

Jr NTR event decision

ఇటీవ‌ల జ‌రిగిన అర్జున్ స‌న్నాఫ్ వైజ‌యంతి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్య‌లు అభిమానుల్లో చర్చ‌కు దారితీశాయి. “మ‌ళ్లీ మాట్లాడేది ఎప్పుడో… ఇప్పుడు మాట్లాడ‌నివ్వండి” అన్న ఆయన మాటలు వెనుక ఏదో సందేశం ఉంద‌నే అభిప్రాయం పుంజుకుంటోంది. తార‌క్ ఇప్ప‌టివ‌ర‌కు అనేక సినిమాల ప్రీ రిలీజ్ వేడుకల్లో పాల్గొన్నా, ఇలా స్పష్టమైన వ్యాఖ్యలు చేయడం ఇదే మొద‌టిసారి.

ఇప్ప‌టికే ప్ర‌శాంత్ నీల్ దర్శకత్వంలో తార‌క్ కొత్త చిత్రం ప్రారంభ‌మైంది. ఈ ప్రాజెక్ట్ విష‌యంలో తార‌క్‌ చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నట్లు ఫిలిం స‌ర్కిల్స్‌ వాద‌న. ఇందులో త‌న లుక్ లీక్ కాకుండా ఉండేందుకే, సినిమా రిలీజ్ వర‌కూ తార‌క్ మిగిలిన హీరోల ఈవెంట్ల‌కు హాజరుకావ‌ద్ద‌నే నిర్ణ‌యం తీసుకున్నార‌ని సమాచారం. ఈ నిర్ణ‌యంతో తార‌క్ ఇకపై త‌న సినిమా ఈవెంట్లు, అన్న‌య్య క‌ల్యాణ్ రామ్ చిత్రాల ఈవెంట్ల‌కే పరిమితం కావ‌చ్చ‌న్న ఊహాగానాలు వెలువడుతున్నాయి.

ఏప్రిల్ 22 నుంచి తారక్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ లో శరవేగగంగా పాల్గొనబోతున్నారు. ఇప్పటికే తారక్ తన శరీరాకృతిని పూర్తి గా మార్చుకుని సన్నబడినట్లు తెలుస్తుంది. ప్రాజెక్ట్ లో భాగంగా కొన్ని షెడ్యూళ్ల తరువాత మళ్ళీ బరువు పెరగాల్సిన అవసరం ఉన్నట్లు సమాచారం. ఈ మార్పుల నేపథ్యంలో లుక్ బయటకు రాకుండా ఉండటానికి తారక్ పక్క ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని సినీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. వార్ 2 తరువాత తారక్ బయట కనిపించే అవకాశాలు తక్కువనే భావన బలంగా వినిపిస్తుంది.

Read More

One thought on “ఈవెంట్‌లకు గుడ్‌బై? తారక్ కొత్త నిర్ణయం

Comments are closed.