ఊర్వశి మరోసారి డాన్స్‌తో అదరగొట్టింది!

Urvashi Rautela Touch Kia Song

బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో వచ్చిన “డాకు మహారాజ్” సినిమా ఐటెం సాంగ్ “దబిడి దిబిడి” విడుదలైనప్పటి నుంచి చర్చలో నిలిచింది. ఈ పాటకు ప్రేక్షకుల నుంచి మిశ్ర స్పందన లభించగా, సినిమా ప్రమోషన్‌లో కీలక పాత్ర పోషించింది. ఈ పాట ఓటీటీలో కూడా మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఇప్పుడు, బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌతేలా “జాట్” సినిమాలో చేసిన “టచ్ కియా” పాట కూడా వైరల్ అవుతోంది. తమన్‌ సంగీతం అందించిన ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. యూట్యూబ్‌లో స్ట్రీమింగ్‌ అయిన గంటలోనే మిలియన్‌ వ్యూస్ సాధించగా, 24 గంటలలో రెండు మిలియన్‌ వ్యూస్‌కు చేరుకునే అవకాశం ఉంది.

సీనియర్‌ నటుడు సన్నీ డియోల్‌ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న “జాట్” ఏప్రిల్ 10న విడుదల కానుంది. మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకునే విధంగా ఊర్వశి రౌతేలా ఐటెం సాంగ్‌తో అదరగొట్టనుంది. ఐటెం సాంగ్స్‌పై వస్తున్న విమర్శల నేపథ్యంలో ఈ పాటకు కొరియోగ్రఫీలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది. జాట్‌ సినిమాలో రెజీనా హీరోయిన్‌గా నటిస్తుండగా, ఈ పాట మేకింగ్‌ వీడియోలో ఆమె కూడా కనిపించడం ఆసక్తికరంగా మారింది.

“జాట్” కథను తొలుత టాలీవుడ్‌ హీరోతో చేయాలని దర్శకుడు గోపీచంద్ మలినేని భావించినా, బడ్జెట్ సమస్యల వల్ల హిందీలో సన్నీ డియోల్‌తో ప్రాజెక్ట్‌ పూర్తయ్యింది. రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్, సయామీ ఖేర్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. తమన్‌ సంగీతం సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పగా, తెలుగు టెక్నీషియన్స్ పెద్దఎత్తున పనిచేశారు. “జాట్” తెలుగులో కూడా విడుదల చేయబోతున్నారు.

Read More

One thought on “ఊర్వశి మరోసారి డాన్స్‌తో అదరగొట్టింది!

Comments are closed.