పాకిస్థాన్‌ తన సరిహద్దు గేట్లు మూసివేసింది

అటారి సరిహద్దు వద్ద ఉదయం 8 గంటల నుంచే పాకిస్థానీ పౌరులు వేచి ఉన్నప్పటికీ… పాకిస్థాన్‌ అధికారుల నుంచి గేట్లు తెరిచే సూచనలు లేకపోవడంతో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

భారత ప్రభుత్వం తాజాగా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం… అవసరమైన అనుమతులు తీసుకున్న పాకిస్థానీ పౌరులు “తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు” అటారి సరిహద్దు గుండా వెళ్తుండేందుకు అనుమతి ఉంది. కానీ పాకిస్థాన్‌ వారిని తిరిగి అంగీకరించకపోవడం చర్చనీయాంశంగా మారింది.

ఇది పాక్ పౌరుల మనుష్య హక్కులను తీవ్రంగా ప్రభావితం చేస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read More : జమ్ముకశ్మీర్ ఉగ్రదాడిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

One thought on “పాకిస్థాన్‌ తన సరిహద్దు గేట్లు మూసివేసింది

Comments are closed.