అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఫిఫా (FIFA) అధ్యక్షుడు జియానీ ఇన్ఫాంటినోను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జియానీ ఇన్ఫాంటినో, ప్రపంచకప్ ఒరిజినల్ ట్రోఫీని ట్రంప్‌కు చూపించారు.
“విజేతలు మాత్రమే ఈ ట్రోఫీని పట్టుకోగలరు, తాకగలరు. మీరు అమెరికాకు విజేత కాబట్టి, దీన్ని తాకవచ్చు” అని ఇన్ఫాంటినో ట్రంప్‌తో అన్నారు. ట్రంప్‌ను ప్రశంసిస్తూ, ఆయన అన్ని విషయాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారని కొనియాడారు. ఈ భేటీకి సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కాగా, వచ్చే ఏడాది అమెరికా, కెనడా, మెక్సికో దేశాలు కలిసి ఫిఫా ప్రపంచకప్‌ను సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇద్దరు ప్రముఖుల భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.
Read More : అమెరికాలో రోడ్డు ప్రమాదం

One thought on “డొనాల్డ్ ట్రంప్‌ను కలిసిన ఫిఫా అధ్యక్షుడు”
Comments are closed.