ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే మెగా డీఎస్సీ (Mega DSC) పరీక్షలు శుక్రవారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 30వ తేదీ వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో ప్రతిరోజూ రెండు సెషన్లుగా నిర్వహించనున్నారు.
పరీక్షల షెడ్యూల్ ఇలా:
- ఉదయం సెషన్: 9:00 AM నుంచి 12:00 PM వరకు
- మధ్యాహ్నం సెషన్: 2:30 PM నుంచి 5:00 PM వరకు
విద్యాశాఖ అధికారులు అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. బయోమెట్రిక్ నమోదుతో పాటు భద్రతా ప్రమాణాలు కఠినంగా అమలులో ఉన్నందున అభ్యర్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని స్పష్టం చేశారు. “నిమిషం లేట్ అయినా అనుమతి లేదు” అనే నిబంధన కఠినంగా అమలులో ఉందని హెచ్చరించారు.
హాల్ టికెట్‌తో పాటు ఆధార్ కార్డు వంటి ఫోటో గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాలి. మొబైల్ ఫోన్లు, స్టడీ మెటీరియల్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను కేంద్రాల్లోకి తీసుకెళ్లకూడదని తెలిపారు.
పరీక్ష కేంద్రాల వివరాలు:
- ఆంధ్రప్రదేశ్‌లో: 137 కేంద్రాలు
- ఇతర రాష్ట్రాల్లో: తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలో 17 కేంద్రాలు
భర్తీ చేయనున్న పోస్టులు:
ఈ డీఎస్సీ ద్వారా మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇప్పటివరకు 3,36,305 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, అర్హత మేరకు 5,77,417 అప్లికేషన్లు సమర్పించారు. కొంతమంది ఒక్కరే పలు పోస్టులకు దరఖాస్తు చేసుకోవడం వల్ల అప్లికేషన్ల సంఖ్య పెరిగింది.
ఈ పరీక్షల ద్వారా రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగాల కలను సాకారం చేసుకునేందుకు లక్షల మంది యువత ఆశగా ఎదురుచూస్తున్నారు.
Read More : కడపలో భూ వివాదంపై హైకోర్టు కీలక ఆదేశాలు.

One thought on “ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలు ప్రారంభం”
Comments are closed.