ట్రంప్‌పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరుతోంది. రిపబ్లికన్ పార్టీ ప్రతిపాదించిన పన్ను బిల్లులకు మస్క్ వ్యతిరేకంగా స్పందించడంతో ఇద్దరి మధ్య రాజకీయ దూరం పెరిగినట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఎలాన్ మస్క్ ట్రంప్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తాజాగా సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో ఆయన చేసిన పోస్ట్‌ తీవ్ర చర్చకు దారితీసింది. “అతిపెద్ద బాంబును పేల్చే సమయం ఆసన్నమైంది” అనే పదాలతో ప్రారంభమైన పోస్ట్‌లో, ట్రంప్ పేరు సెక్స్ కుంభకోణం దర్యాప్తు ఫైలులో ఉందని మస్క్ పేర్కొన్నారు.

“సెక్స్‌ కుంభకోణంలో ఇప్పటికే నిందితుడిగా ఉన్న వ్యక్తితో ట్రంప్‌కు సంబంధాలున్నాయి. ఈ విషయాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయి,” అని మస్క్ ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు అమెరికా రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

ఇప్పటివరకు ట్రంప్ వర్గం దీనిపై అధికారికంగా స్పందించలేదు. అయితే ట్రంప్‌పై వచ్చిన ఈ ఆరోపణలు ఎన్నికల నేపథ్యంలో కొత్త రాజకీయ హోరును తెరపైకి తెస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

read More : అమెరికా వాణిజ్య విధానంపై ఎలాన్ మస్క్ తీవ్ర విమర్శలు

One thought on “ట్రంప్‌పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు

Comments are closed.