ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు మలుపు తిరిగింది. రంగారెడ్డి జిల్లా కాచారంలో ఉన్న సులోచన ఫామ్‌హౌస్‌పై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) అధికారులు దాడులు నిర్వహించి భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. తాజా సమాచారం ప్రకారం, అధికారులు 12 బాక్సుల్లో దాచిన రూ.11 కోట్లను సీజ్ చేశారు.
సిట్ దర్యాప్తులో కీలక పాత్ర పోషిస్తున్న A40 వరుణ్ ఇచ్చిన సమాచారంతో ఈ దాడులు చేపట్టినట్టు తెలుస్తోంది. ఈ నగదు ఏ1 రాజ్ కేసిరెడ్డి ఆదేశాలతో దాచినట్టు వరుణ్ మరియు చాణక్య విచారణలో వెల్లడించినట్లు అధికారులు తెలిపారు. 2024 జూన్‌లో ఈ నగదు ఫామ్‌హౌస్‌లో దాచినట్టు కూడా దర్యాప్తులో తేలిందని సమాచారం.
ప్రొఫెసర్ బాల్‌రెడ్డి పేరుతో ఉన్న సులోచన ఫామ్‌హౌస్‌లో ఈ నగదు ఉంచినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ కేసులో మరిన్ని కీలక ఆధారాలు బయటపడే అవకాశం ఉందని సిట్ వర్గాలు సూచిస్తున్నాయి. దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.
Read More : విశాఖ స్టీల్–సెయిల్ విలీనం ప్రణాళికలేదని కేంద్రం

One thought on “ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక మలుపు”
Comments are closed.