విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలన్న డిమాండ్లపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. ప్లాంట్‌ను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్)లో విలీనం చేసే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ లోక్‌సభలో ప్రకటించారు.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆదిత్య యాదవ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి మాట్లాడుతూ, విశాఖ ఉక్కు ప్లాంట్‌ను యథాతథంగా కొనసాగించేందుకు కేంద్రం ఇప్పటివరకు రూ.11,440 కోట్ల ఆర్థిక సహాయం అందించిందని వెల్లడించారు.
ఈ ప్రకటనతో విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేస్తారనే వార్తలకు తెరపడినట్టైంది.
Read More : విశాఖలో గూగుల్ డేటా సెంటర్ – సీఎం కీలక ప్రకటన

One thought on “విశాఖ స్టీల్–సెయిల్ విలీనం ప్రణాళికలేదని కేంద్రం”
Comments are closed.