ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మరో నిందితుడు వెంకటేశ్ నాయుడును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు మంగళవారం ఉదయం కస్టడీలోకి తీసుకున్నారు.
విజయవాడ సబ్ జైలులో రిమాండ్‌లో ఉన్న ఈ ఇద్దరినీ ముందుగా వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, అనంతరం సిట్ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఏసీబీ కోర్టు మంగళవారం నుంచి మూడు రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇవ్వడంతో విచారణ మొదలైంది. కోర్టు ఆదేశాల ప్రకారం, ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారణ జరగనుంది. ఈ విచారణలో లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన కీలక సమాచారం బయటపడే అవకాశముంది.
జైలు బయట చెవిరెడ్డి భావోద్వేగం
విజయవాడ సబ్ జైలు బయటకు వస్తున్న సమయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ, “నాపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించారు. ఇది తీవ్ర అన్యాయం. దేవుడు అన్నీ చూస్తున్నాడు. అబద్ధపు ఆరోపణలు వేసిన వారిని కాలమే శిక్షిస్తుంది” అని అన్నారు.
అంతేకాకుండా, ఈ కేసుపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతుండగా, సిట్ అధికులు మరిన్ని కీలక ఆధారాలు సేకరించే ప్రయత్నంలో ఉన్నారు.
Read More : చెవిరెడ్డి కస్టడీ, మోహిత్ బెయిల్ నిరాకరణ

One thought on “చెవిరెడ్డి, వెంకటేశ్ నాయుడు సిట్ కస్టడీకి తరలింపు”
Comments are closed.