మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన వైఎస్‌ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏసీబీ కోర్టు తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో మరింత లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని భావించిన కోర్టు, భాస్కర్ రెడ్డి సహా మరో నిందితుడు వెంకటేశ్ నాయుడును మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జూలై 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారణ కొనసాగుతుంది. గతంలో సిట్ అధికారులు వీరిద్దరినీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా, న్యాయమూర్తి జూలై 1వ తేదీ వరకు రిమాండ్ విధించారు. గడువు ముగియనుండటంతో, సిట్ మరోసారి కోర్టును ఆశ్రయించగా, వారు కోరిన కస్టడీకి అనుమతించారు.
ఇదే కేసులో 39వ నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా ఏసీబీ కోర్టు తిరస్కరించింది.
ఈ నేపథ్యంలో, చెవిరెడ్డి కుటుంబానికి న్యాయపరంగా ఊరట లభించకపోవడం గమనార్హం. ఇప్పటికే సిట్ అధికారులు ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించగా, పోలీస్ కస్టడీ సమయంలో మరిన్ని కీలక సమాచారం బయటకు వచ్చే అవకాశముంది.
Read More : తాడేపల్లిలో యువజన విభాగంతో జగన్ సమావేశం

One thought on “చెవిరెడ్డి కస్టడీ, మోహిత్ బెయిల్ నిరాకరణ”
Comments are closed.