తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రవాణా రంగ అభివృద్ధిలో మరో కీలక ముందడుగు వేసింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చుట్టూ అభివృద్ధి చేయనున్న ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టుకు సంబంధించి తుది లొకేషన్ సర్వే విజయవంతంగా పూర్తయింది. ఈ ప్రాజెక్టు అమలులోకి వస్తే, హైదరాబాద్‌ను చుట్టూ ఒక కొత్త రైల్వే రింగ్ మార్గం ఏర్పడనుంది. ఇది ప్రయాణికుల రవాణాతో పాటు సరుకు రవాణాలో కూడా game-changerగా మారే అవకాశముంది.
దేశంలో వినూత్నంగా చేపడుతున్న ఈ ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు పూర్తయిన తర్వాత, ట్రాఫిక్ భారం తగ్గుతుంది మరియు తక్కువ సమయంలో నగరానికి చేరుకునే అవకాశం పెరుగుతుంది. ఇక ఇప్పటికే ఉన్న రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానించి, శక్తివంతమైన రవాణా మార్గంగా దీన్ని అభివృద్ధి చేయనున్నారు.
ప్రాజెక్టు త్వరలోనే అమలులోకి తీసుకురావడానికి సంబంధిత శాఖలు కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నట్లు సమాచారం.
Read More : కాన్పు కోసం పుట్టింటికి వెళ్లి వస్తే ఇంటే అమ్మేశాడు..

One thought on “తెలంగాణ రవాణా రంగంలో మరో అడుగు.. ?”
Comments are closed.