సోషల్ మీడియాపై హైకోర్టు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సోషల్ మీడియా సంబంధిత వ్యవహారాల్లో కీలక నిర్ణయం తీసుకుంది. న్యాయమూర్తి న్యాపతి విజయ్ ఆదేశాల మేరకు సోషల్ మీడియా వేదికల్లో అసభ్య పదజాలాన్ని, విద్వేషపూరిత వ్యాఖ్యలను, నీచమైన ట్రోలింగ్‌ను ఆటోమేటిక్‌గా గుర్తించి బ్లాక్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

సోషల్ మీడియా వేదికలు ప్రజలను గాయపరిచే విధంగా మారకూడదని హైకోర్టు స్పష్టం చేసింది. అసభ్యత, ద్వేషపూరిత వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణల వల్ల సమాజంలో అశాంతి వ్యాప్తించే అవకాశం ఉన్నందున వాటిని అరికట్టాల్సిన అవసరం ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది.

ఈ చర్యల కోసం ప్రభుత్వం, సంబంధిత సోషల్ మీడియా సంస్థలతో సమన్వయం చేసుకుని తగిన టెక్నికల్ పరిష్కారాలు తీసుకోవాలని న్యాయస్థానం సూచించింది. ఈ ఆదేశాలతో పాటు సామాజిక బాధ్యత నేపథ్యంలో సోషల్ మీడియా వేదికలపై పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని న్యాయమూర్తి పేర్కొన్నారు.

Read More : వైఎస్ రాజారెడ్డి 100వ జయంతి సందర్భంగా వైఎస్ షర్మిల ఘన నివాళి.

One thought on “సోషల్ మీడియాపై హైకోర్టు కీలక ఆదేశాలు

Comments are closed.