మావోయిస్టు కార్యకలాపాల్లో కీలకంగా ఉన్న టాప్ లీడర్ మాదవి హిడ్మా పోలీసుల ముఠాకు చిక్కాడు. చత్తీస్‌గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో పలు నక్సలైట్ దాడులకు పాల్పడ్డ హిడ్మాను ఒడిశాలోని కోరాపుట్ జిల్లా పరిధిలో అరెస్ట్ చేసినట్లు పోలీసు శాఖ అధికారులు తెలిపారు. హిడ్మా అరెస్ట్ మావోయిస్టు చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా పేర్కొంటున్నారు.
అరెస్ట్ సమయంలో హిడ్మా వద్ద నుంచి ఏకే-47తో పాటు మరికొన్ని కీలక ఆయుధాలు, పేలుడు పదార్థాలు, కమ్యూనికేషన్ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. గతంలో దంతేవాడా, సుక్మా, బీజాపూర్ జిల్లాల్లో జరిగిన అత్యంత దారుణమైన దాడుల్లో హిడ్మా పాత్ర ఉందని విచారణలో వెల్లడైనట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఈ అరెస్ట్‌తో మావోయిస్టు శిబిరాల్లో గందరగోళం నెలకొంది. హిడ్మా అరెస్ట్‌పై మరింత సమాచారం త్వరలో వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.
ఇది మావోయిస్టు ఉద్యమాన్ని తగ్గించే దిశగా ఒక కీలక విజయంగా భావిస్తున్నారు.


Read More : తాను పట్టించుకోనని తేల్చేసిన సీనియర్ నేత
