గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాం: సీఎం చంద్రబాబు

chandrababu

తన జీవితంలో రాజకీయ కక్షలు పెట్టుకునే అలవాటు లేదని ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) స్పష్టం చేశారు. అసెంబ్లీలో ప్రసంగించిన ఆయన, వైకాపా ప్రభుత్వ హయాంలో తమ పార్టీ కార్యాలయాలపై దాడులు జరిగాయని తెలిపారు.

“ప్రజాస్వామ్యంలో పార్టీ కార్యాలయాలపై దాడులు జరగడం అనాగరికం. శాంతిభద్రతల సమస్యలు సృష్టించే వారికి మాత్రం ఉపేక్ష ఉండదు” అని చంద్రబాబు హెచ్చరించారు.

ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి (Ganja), డ్రగ్స్ (Drugs) లాంటి మాదక ద్రవ్యాల వినియోగం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, “కొంతమంది గంజాయి, డ్రగ్స్‌కు అలవాటు పడుతున్నారు. మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ప్రత్యేకంగా ‘ఈగల్’ (EAGLE) అనే విభాగాన్ని ఏర్పాటు చేశాం. ఎవరైనా గంజాయి పండించి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడితే తీవ్రంగా ఎదుర్కొంటాం. రాష్ట్రంలో ఒక్క ఎకరాలో కూడా గంజాయి పండించకుండా కఠిన చర్యలు తీసుకుంటాం. గంజాయి, డ్రగ్స్‌పై యుద్ధం చేస్తున్నాం.. ఆపేది లేదు” అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

Read More

One thought on “గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాం: సీఎం చంద్రబాబు

Comments are closed.