బీసీ రిజర్వేషన్ల ధర్నాలో పాల్గొననున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరనున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేపు జంతర్ మంతర్‌లో జరగనున్న ధర్నాలో ఆయన పాల్గొననున్నారు. ఈ ధర్నా మూడు రోజుల పాటు కొనసాగనుంది.

ముఖ్యమంత్రితో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్తున్నారు.

ఇక బీసీ రిజర్వేషన్ల అంశంపై పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానాలు సమర్పించనున్నారు.

Read More : బంజారాహిల్స్‌లో రోడ్డు కుంగి ట్యాంకర్ ప్రమాదం

One thought on “బీసీ రిజర్వేషన్ల ధర్నాలో పాల్గొననున్నారు

Comments are closed.