భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు ఐదు సంవత్సరాల విరామం తర్వాత చైనా పౌరులకు పర్యాటక వీసాలను మళ్లీ జారీ చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం ఈరోజు నుంచే అమల్లోకి వచ్చింది. భారత్-చైనా దేశాల మధ్య సంబంధాలు పునరుద్ధరించడానికి, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తోడ్పడుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
తెలుసుకున్న వివరాల ప్రకారం, ఈ వీసా మంజూరు ప్రక్రియలో భద్రతా ప్రమాణాలకు ప్రాధాన్యతనిస్తూ, కఠినమైన పరిశీలన తర్వాతే పర్యాటక వీసాలు మంజూరు చేయనున్నట్లు సమాచారం. 2019లో గల్వాన్ లోయ సంఘటనల తర్వాత ఇరుదేశాల మధ్య పలు పరిమితులు అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు సంబంధాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర వర్గాలు వెల్లడించాయి.
పర్యాటక రంగానికి ఊపిరి పీల్చేలా ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Read More : ఇటలీలో విమాన ప్రమాదం!

One thought on “చైనా పౌరులకు పర్యాటక వీసాల జారీ పునఃప్రారంభం”
Comments are closed.