ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 23న విడుదల

పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలకు సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ రామరాజు, సోమవారం విజయవాడలో విలేకర్లతో మాట్లాడుతూ, ఏప్రిల్ 23న పదో తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఫలితాలను విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లు, వాట్సాప్ (మన మిత్ర), LEAP యాప్‌ల ద్వారా తనిఖీ చేయవచ్చని పేర్కొన్నారు.

అభ్యర్థులు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్లు https://bse.ap.gov.in, https://apopenschool.ap.gov.in/, ‘మన మిత్ర’ (వాట్సాప్) 9552300009 నంబర్‌కు “Hi” అని మెసేజ్ పంపి, SSC పబ్లిక్ పరీక్ష ఫలితాలను పొందవచ్చు. అలాగే, LEAP మొబైల్ యాప్ ద్వారా కూడా విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు ఫలితాలను పొందగలుగుతారు.

ఈ సంవత్సరం పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు నిర్వహించబడ్డాయి. 6,19,275 మంది విద్యార్థులు ఈ పరీక్షలో పాల్గొన్నారు. మూల్యాంకనం ప్రక్రియ ఏప్రిల్ 3 నుంచి 9వ తేదీ వరకు కొనసాగింది, మరియు మార్కులను ఆన్‌లైన్‌లో ఎంటర్‌ చేయడమైనది.

ఫలితాలు వచ్చే రోజు ఉదయం 10.00 గంటలకు విడుదల చేయాలని, సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు లాగిన్ ద్వారా తమ పాఠశాల ఫలితాలను డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.

Read More :తెలుగు రాష్ట్రాల్లో ఎండల మోత, వర్ష సూచనలతో వాతావరణ శాఖ హెచ్చరిక!

One thought on “ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 23న విడుదల

Comments are closed.