శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఒక వివాహ వేడుకలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వేదికపై చేసిన నృత్యం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. తన బంధువుల వివాహానికి హాజరైన మంత్రి వేడుకల్లో భాగంగా స్టేజీపై అడుగుపెట్టారు. అక్కడ ఉన్న యువకులు ఇచ్చిన ఆహ్వానాన్ని స్వీకరించి వారితో కలిసి డ్యాన్స్ చేస్తూ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మంత్రి రామ్మోహన్ వేసిన స్టెప్పులు, ఆయన ఉత్సాహం వేడుకలో హాజరైన వారిని అలరించాయి. ఈ సరదా క్షణాలను అక్కడి అతిథులు తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పంచుకున్నారు. క్షణాల్లోనే వీడియో వైరల్‌గా మారి నెట్టిజన్ల నుంచి విపరీతమైన స్పందన అందుకుంది.
సాధారణంగా రాజకీయ నాయకులు ప్రజా వేదికలపై ఇలాంటివి అరుదుగా చేస్తారు. కానీ రామ్మోహన్ నాయుడు ఇలా మమేకమై డ్యాన్స్ చేయడం ఆయన సరదా మనస్తత్వాన్ని చూపిస్తోందని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
Read More : NCLTలో జగన్‌కు ఊరటా?

One thought on “శ్రీకాకుళంలో రామ్మోహన్ డ్యాన్స్ వైరల్?”
Comments are closed.