రోదసిలో 18 రోజుల సాహసయాత్రను పూర్తి చేసి భూమికి క్షేమంగా తిరిగొచ్చిన శుభాంశు శుక్లా ప్రస్తుతం క్వారంటైన్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. స్పేస్ మిషన్‌లో భాగంగా అనేక ప్రయోగాల్లో పాల్గొన్న శుక్లా, భూమి వాతావరణానికి మళ్లీ శరీరం తడవబడేలా నిపుణుల సూచనల మేరకు పలు శారీరక వ్యాయామాలు చేస్తున్నారు.
శరీరం మళ్లీ సాధారణ స్థితికి రావాలంటే క్రమమైన వ్యాయామం అవసరమని వైద్య నిపుణులు సూచించడంతో, నడకతో పాటు ప్రత్యేక శిక్షణలో శుక్లా పాల్గొంటున్నారు. రోదసి ప్రభావంతో శరీరంపై మార్పులు వచ్చినప్పటికీ, శుభాంశు శుక్లా పూర్తిగా కోలుకుంటున్నారని అధికారులు తెలిపారు.
Read More : మిగ్-21లకు గుడ్‌బై, తేజస్‌కి స్వాగతం

One thought on “రోదసిలో 18 రోజులు గడిపిన శుభాంశు శుక్లా… మళ్లీ నడక అభ్యాసం”
Comments are closed.