వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. పరామర్శ పేరుతో జగన్ చేపడుతున్న యాత్రలు రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆయన ఆరోపించారు. సోమవారం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన అచ్చెన్నాయుడు, “ఇది ఓదార్పు కాదు, ఓ రకమైన బల ప్రదర్శన” అని వ్యాఖ్యానించారు.
“ఎవరు చనిపోతే ఏడాది తర్వాత పరామర్శకు వెళ్తారా?”
రెంటపాళెంలో జరిగిన సంఘటనపై జగన్ పర్యటనను తప్పుపట్టిన అచ్చెన్నాయుడు, “ఎవరికైనా పరామర్శకు ఏడాది తర్వాత వెళ్తారా? ఇది సహజమా?” అంటూ ప్రశ్నించారు. డ్రగ్స్, గంజాయి కేసుల్లో చిక్కినవారిని పరామర్శించేందుకు జగన్ వెళ్లడం శోభనకరముకాదన్నారు.
చంద్రబాబు పాలనలో పెట్టుబడుల వెల్లువ
ప్రభుత్వ పనితీరును కూడా ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు వివరించారు. ఒక్క ఏడాదిలోనే సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి సర్కార్ రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చిందని తెలిపారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం చొరవ చూపుతోందని, పొగాకు, మామిడి రైతులకు నష్టపరిహారాన్ని అందజేస్తున్నామని చెప్పారు.
“800 బస్సులు, 2000 కార్లతో రైతుల తరలింపు ఎందుకు?”
వైఎస్ జగన్ బంగారుపాలెం వ్యవసాయ మార్కెట్‌కు పర్యటన నేపథ్యంలో, దానికి భారీ ఏర్పాట్లు చేయడాన్ని అచ్చెన్నాయుడు తప్పుపట్టారు. “800 బస్సులు, 2000 కార్లతో రైతులను తరలించడమేంటి? ఇది బల ప్రదర్శన కాదా?” అంటూ ప్రశ్నించారు.
“వైఎస్ జగన్‌కు ప్రజల్లో చైతన్యం పెరుగుతుండటమే భయం”
గత ఐదేళ్ల వైఎస్ జగన్ పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఇప్పుడు అధికారంలో లేకపోవడంతో పార్టీ జెండాలు పట్టుకుని రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి యాత్రలు చేస్తున్నారని ఆరోపించారు. మంగళవారం మార్కెట్‌కు వచ్చే జగన్‌ను రైతులు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.
Read More : లోకేశ్ ఘాటు విమర్శలు: జగన్ వైఖరిపై మండిపాటు

One thought on “వైఎస్ జగన్‌పై అచ్చెన్నాయుడు ఘాటు విమర్శలు”
Comments are closed.