తిరుపతిలో సైకో వ్యక్తి వీరంగం: ఒకరు మృతి, ఇద్దరు గాయపాటు

తిరుపతి నగరంలో మానసిక స్థిరత్వం లేని ఓ వ్యక్తి సృష్టించిన దుర్మార్గ ఘటన కలకలం రేపుతోంది. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని కపిల్ తీర్థం రోడ్డులో సోమవారం ఉదయం ఓ సైకో వ్యక్తి కత్తి, కర్రలతో ముగ్గురిపై అఘాయిత్యంగా దాడికి దిగాడు. ఈ దాడిలో శేఖర్ (55) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి మరణించగా, మరో ఇద్దరు వ్యక్తులు సుబ్రహ్మణ్యం, కల్పనలు గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు, మున్సిపాలిటీ సిబ్బంది సహకారంతో గంటసేపటి ప్రయత్నాల అనంతరం నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడు తమిళనాడుకు చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలను సేకరిస్తున్నట్టు తెలిపారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

Read More : వైఎస్ జగన్‌పై అచ్చెన్నాయుడు ఘాటు విమర్శలు

One thought on “తిరుపతిలో సైకో వ్యక్తి వీరంగం: ఒకరు మృతి, ఇద్దరు గాయపాటు

Comments are closed.