ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపు కాల్స్

బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి బెదిరింపు కాల్ వచ్చింది. “హైదరాబాద్‌లోనే ఉన్నాం, సాయంత్రంలోగా చంపేస్తాం” అని గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరించారు. ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

రఘునందన్ రావుకు ఇలా బెదిరింపు కాల్స్ రావడం ఇది ఆరోసారి. ఇప్పటికే ఐదుసార్లు ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. ఈ తాజా బెదిరింపుపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎంపీ భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఈ బెదిరింపుల వెనుక ఎవరున్నారనే దానిపై ఆరా తీస్తున్నారు.

Read More : హనుమకొండలో మంత్రి పొంగులేటి కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై విమర్శలు

One thought on “ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపు కాల్స్

Comments are closed.