ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బీఎడ్‌ ప్రశ్నాపత్రం లీక్

exam paper leaked

కళాశాల యాజమాన్యాలపై ఆరోపణలు

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బీఎడ్‌ పరీక్షకు సంబంధించి ప్రశ్నాపత్రం లీకైన ఘటన కలకలం రేపింది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభంకావాల్సిన “ప్రాస్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్” పరీక్ష ప్రశ్నాపత్రం ముందుగా బయటకు రావడంతో విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందు క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని సమాచారం.

ఈ ఘటనపై కళాశాల యాజమాన్యాలే లీక్‌కు కారణమంటూ ఆరోపణలు వెలువడుతున్నాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విశ్వవిద్యాలయ అధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. పరీక్షల ప్రామాణికతపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సంబంధిత అధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

Read More