వేధింపులపై ఎన్‌సీడబ్ల్యూకు ఫిర్యాదు చేసిన విడుదల రజిని

ప్రభుత్వం తన పట్ల తీసుకుంటున్న అన్యాయ వైఖరిని నిరసిస్తూ మాజీ మంత్రి విడుదల రజిని కేంద్ర ప్రభుత్వ కమిషన్లను ఆశ్రయించారు. ప్రభుత్వ అనుకూల మీడియా, సోషల్ మీడియా ద్వారా తనపై నిరంతరం వేధింపులు కొనసాగుతున్నాయని, ప్రభుత్వం ఈ అంశాన్ని పట్టించుకోకపోవడంతో తనకు న్యాయం చేయాలంటూ జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్సీ), జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూకు) ఆమె ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు ఎన్హెచ్ఆర్సీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన విడుదల రజిని… “ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లు నిరాధార ఆరోపణలు చేస్తూ నిరంతరం వేధిస్తున్నాయి. దీనివల్ల నా గౌరవం దెబ్బతింది. కుటుంబ సభ్యులు కూడా మానసిక ఒత్తిడికి గురవుతున్నారు” అని పేర్కొన్నారు.

తనపై జరుగుతున్న ఈ కక్ష సాధింపు చర్యలపై ఇప్పటికే పలుమార్లు సంబంధిత అధికారులను పలుమార్లు సంప్రదించినప్పటికీ, ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తన హక్కులను కాపాడాలన్న ఆవశ్యకతతోనే ఎన్హెచ్ఆర్సీ, ఎన్‌సీడబ్ల్యూకు ఫిర్యాదు చేశానని వివరించారు.

ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితుల అభ్యంతరాలను పరిష్కరించాలన్న డిమాండ్ పెరుగుతోంది.

Read More : ఏపీలో ‘తల్లికి వందనం’ పథకానికి శ్రీకారం

One thought on “వేధింపులపై ఎన్‌సీడబ్ల్యూకు ఫిర్యాదు చేసిన విడుదల రజిని

Comments are closed.