ప్రతి సంవత్సరం గణేష్ చతుర్థి వేడుకలకు కేంద్రంగా నిలిచే ముంబైలోని ప్రముఖ ‘లాల్ బాగ్చా రాజా’ గణేశుడి కొత్త రూపాన్ని నిర్వాహకులు విడుదల చేశారు. నవరాత్రి ఉత్సవాల ప్రారంభానికి ముందుగానే ఈ లుక్ రివీల్ చేయడం భక్తుల్లో ఉత్సాహాన్ని నింపింది.
లాల్ బాగ్చా రాజా విశిష్టత:
1934వ సంవత్సరం నుంచి లాల్‌బాగ్‌చా మార్కెట్ ప్రాంతంలో కొలువుదీరే ఈ గణనాథుడు ఎంతో ప్రసిద్ధి చెందారు. మహారాష్ట్రలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా లక్షలాది మంది భక్తులు లాల్‌బాగ్చా రాజాను దర్శించుకుంటారు. ఈ సంవత్సరం కూడా భారీగా భక్తులు వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో, భద్రత, భక్తుల సౌకర్యాల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
Read More : కేరళ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మమ్కూటథిల్ సస్పెన్షన్ ?

One thought on “గణేష్ చతుర్థి: లాల్ బాగ్చా రాజా కొత్త లుక్ విడుదల”
Comments are closed.