ఖమ్మంలో భర్తపై భార్య దాడి

ఖమ్మం జిల్లాలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. పెనుబల్లి మండలం వీఎం బంజర్ పంచాయితీ పరిధిలోని జంగాల కాలనీలో ఓ భర్తపై భార్య దారుణంగా దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే… 51 ఏళ్ల గంగారాం మద్యానికి బానిస కావడంతో భార్య లక్ష్మితో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం లక్ష్మి తనకు దెయ్యం పట్టిందని నటించి, భర్తను దారుణంగా కొట్టింది. గంగారాం నోటిలో గుడ్డలు కుక్కి, కర్రతో, ఇనుపరాడ్‌తో విచక్షణారహితంగా దాడి చేసింది.

తీవ్ర గాయాల కారణంగా గంగారాం కేకలు వేయడంతో బంధువులు అతడిని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అతడి పక్కటెముకలు విరిగినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం గంగారాం ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read More : మహేశ్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు ?