ఏపీలో పేదరిక నిర్మూలనకు ‘P-4’ కార్యక్రమం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో పేదరికం లేని సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘P-4’ (Poverty to Prosperity through People’s Partnership) కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళగిరిలో లాంఛనంగా ప్రారంభించారు.

గతంలో ఉగాది రోజున ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన ప్రభుత్వం, అప్పటి నుంచి పేదల ఎంపిక ప్రక్రియను చేపట్టింది. ఈ పథకంలో భాగంగా బంగారు కుటుంబాలు (వందశాతం పేదరికం నుంచి బయటపడిన కుటుంబాలు), మార్గదర్శులు (ప్రగతికి ఆదర్శంగా నిలిచినవారు) ఎంపిక పూర్తి అయ్యింది. పేదలందరినీ పేదరికం నుంచి బయటపడేలా చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ముఖ్యమంత్రి తెలిపారు. ఇది పేదరికం నిర్మూలనకు ఒక సమగ్రమైన ప్రణాళిక అని ఆయన అన్నారు.

Read More : శ్రీశైలం ఘాట్ రోడ్డులో పెను ప్రమాదం