శ్రీశైలం ఘాట్ రోడ్డులో పెను ప్రమాదం

శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీ వర్షాల కారణంగా పెను ప్రమాదం తప్పింది. వ్యూ పాయింట్ నుంచి పాతాళగంగకు వెళ్లే మార్గంలో కొండపై నుంచి భారీగా రాళ్లు జారిపడ్డాయి.

ఈ ఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు రహదారిపై రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. రోడ్డుపై పడ్డ రాళ్లను తొలగించే పనులు చేపట్టారు. వర్షాల నేపథ్యంలో ఘాట్ రోడ్డుపై ప్రయాణించేవారు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు, అధికారులు సూచిస్తున్నారు.

Read More : సుప్రీంకోర్టులో బెయిల్ రద్దుపై వాదనలు

One thought on “శ్రీశైలం ఘాట్ రోడ్డులో పెను ప్రమాదం

Comments are closed.