ఆదోని బస్సులో అగ్ని ప్రమాదం: ప్రయాణికులు సురక్షితం

కర్నూలు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ఆదోని నుంచి కర్నూలుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో గోనెగండ్ల వద్ద అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అయితే, డ్రైవర్, స్థానికుల చొరవతో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు.

బస్సులో మంటలు రావడం గమనించిన డ్రైవర్, వెంటనే అప్రమత్తమై బస్సును రోడ్డు పక్కన ఆపేశారు. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. అదే సమయంలో, మంటలను చూసిన స్థానిక యువకులు వెంటనే నీళ్లు చల్లి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. డ్రైవర్, స్థానికుల సమయస్ఫూర్తి కారణంగా బస్సులో ఉన్న ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.

Read More : శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద: 10 గేట్లు ఎత్తివేత