నందమూరి కుటుంబంలో విషాదం నెలకొంది. దివంగత ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు ఎన్టీఆర్ పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ భార్య పద్మజ ఈ ఉదయం కన్నుమూశారు. హైదరాబాద్ ఫిలింనగర్‌లోని నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
పద్మజ, రాజమండ్రి ఎంపీ, బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి భర్త, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు సోదరి కావడం విశేషం. ఆమె మృతితో నందమూరి, దగ్గుబాటి కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. పద్మజ మరణవార్త తెలిసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జయకృష్ణ కుటుంబాన్ని పరామర్శించేందుకు, పద్మజకు నివాళులర్పించేందుకు వారు అమరావతి నుంచి హైదరాబాద్ బయలుదేరినట్లు సమాచారం.
ఇక నందమూరి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వరుసగా ఫిలింనగర్‌లోని జయకృష్ణ నివాసానికి చేరుకుని పద్మజ భౌతికకాయానికి నివాళులు అర్పిస్తున్నారు. ఆమె మృతి కుటుంబానికి తీరని లోటని అందరూ భావిస్తున్నారు.
Read More : బోధన్‌లో గూఢచారి పావురం కలకలం (video)

One thought on “నందమూరి కుటుంబంలో విషాదం”
Comments are closed.