బిగ్ బాస్ సీజన్ 3 విజేతగా గుర్తింపు పొందిన, ఆర్ఆర్ఆర్లోని ‘నాటు నాటు’ పాటతో ఆస్కార్ గెలుచుకున్న గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ వ్యక్తిగత జీవితంలో కొత్త అడుగు వేశాడు. తన ప్రేయసి హరిణి రెడ్డితో రాహుల్ నిశ్చితార్థం చేసుకున్నాడు. హైదరాబాద్‌లో అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుక ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఎంగేజ్మెంట్ ఫొటోలు అధికారికంగా విడుదల చేయకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం వేగంగా వైరల్ అవుతున్నాయి. అభిమానులు, నెటిజన్లు రాహుల్ సిప్లిగంజ్ను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నిశ్చితార్థ వేడుకలో రాహుల్–హరిణి రెడ్డి కలర్‌ఫుల్ డ్రెస్సుల్లో మెరిసిపోగా, ఈ జంట చూడముచ్చటగా ఉందంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. రాహుల్ పెళ్లిపై అధికారిక ప్రకటన కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక, ఇటీవల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ సిప్లిగంజ్‌కు ఒక కోటి రూపాయల చెక్కు అందజేసిన విషయం తెలిసిందే.
Read More : సంయుక్త మీనన్ వ్యాఖ్యలు హాట్‌టాపిక్

2 thoughts on “రాహుల్ సిప్లిగంజ్–హరిణి రెడ్డి నిశ్చితార్థం..”
Comments are closed.