హైదరాబాద్‌లోని చందానగర్‌లో ఇవాళ (మంగళవారం) ఉదయం భారీ దోపిడీ కలకలం రేపింది. ఖజానా జ్యువెలర్స్ దుకాణంలోకి కొంతమంది దుండగులు అకస్మాత్తుగా ప్రవేశించి తుపాకులతో సిబ్బందిని బెదిరించారు. ప్రతిఘటించిన డిప్యూటీ మేనేజర్‌పై ఇద్దరు రౌడ్లు రెండు రౌండ్ల కాల్పులు జరపగా, ఆయన కాళ్లకు తీవ్రగాయాలు అయ్యాయి. అనంతరం సీసీ కెమెరాలను ధ్వంసం చేసి, భారీగా బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు.
మొత్తం ఘటన షాపు తెరిచిన ఐదు నిమిషాల్లోనే జరిగిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని, దుండగులు జహీరాబాద్ వైపు పారిపోయినట్లు గుర్తించారు. జిల్లా సరిహద్దు పోలీసులకు అలర్ట్ జారీ చేశారు.
సైబరాబాద్ సీపీ ప్రకారం, KPHPలో ఇటీవల జరిగిన దోపిడీకి పాల్పడిన ముఠానే ఈ దాడి చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. KPHP ఘటనలో 20 తులాల బంగారం, రూ.3 లక్షలు దోచుకున్న ముఠా, ఖజానా జ్యువెలర్స్‌లో మరింత భారీ మొత్తంలో బంగారం అపహరించినట్లు సమాచారం. నిందితులను పట్టుకునేందుకు 10 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.
Read More : బండి సంజయ్‌కు కేటీఆర్ లీగల్ నోటీసు

One thought on “చందానగర్ ఖజానా జ్యువెలర్స్‌లో భారీ దోపిడీ, కాల్పులు”
Comments are closed.