పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక: B-Tech Ravi

పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ నేడు ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఈ ఎన్నికలను అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని గెలుపు కోసం సర్వశక్తులు వినియోగిస్తున్నాయి. ప్రచారం దశ యుద్ధ వాతావరణాన్ని తలపించగా, పోలింగ్ రోజు కూడా ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.

ఇప్పటికే కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి, వైసీపీ నేత సతీశ్ రెడ్డి లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

పోలింగ్ ప్రారంభమైన అనంతరం టీడీపీ నేత బీటెక్ రవి వైసీపీ అధినేత జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక కోసం వైసీపీ రూ.100 కోట్లు ఖర్చు చేసిందని ఆయన ఆరోపించారు. పోలింగ్ జరుగుతున్న సమయంలోనే ఓటుకు రూ.5 వేల చొప్పున డబ్బులు పంచుతున్నారని, మహిళలకు చీరలు, ముక్కు పుడకలు పంపిణీ చేస్తున్నారని విమర్శించారు. ఐదేళ్లుగా అక్రమంగా సంపాదించిన అవినీతి సొమ్మును ఈ ఉప ఎన్నిక గెలుపు కోసం కుమ్మరిస్తున్నారని బీటెక్ రవి వ్యాఖ్యానించారు.

Read More : పులివెందుల, ఒంటిమిట్టలో కూటమి విజయం ఖాయం: పల్లా శ్రీనివాసరావు

One thought on “పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక: B-Tech Ravi

Comments are closed.