జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో స్థానిక అభ్యర్థికే టికెట్ – మంత్రి

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో జరగబోయే ఉపఎన్నికకు స్థానిక అభ్యర్థికే టికెట్‌ కేటాయించనున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రకటించారు. మంగళవారం జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 5లోని ఓ హోటల్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఆశావహులు అందరూ కలిసి నియోజకవర్గంలో పర్యటించి ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఎన్నికల సమయంలో పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేసేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు పేర్కొన్నారు.

సర్వేల ఆధారంగా సరైన అభ్యర్థిని ఏఐసీసీ ఎంపిక చేస్తుందని చెప్పారు. కంటోన్మెంట్‌ ఉపఎన్నికలో ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టిన విషయాన్ని గుర్తుచేశారు. హైదరాబాద్‌ సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తోందని తెలిపారు. పేదలకు వారు నివసిస్తున్న ప్రాంతాల్లోనే పక్కా గృహాలను అందించేందుకు ఇందిరమ్మ మోడల్‌ కాలనీలు ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు.

ఆగస్టు 1 నుంచి నగరంలోని 15 నియోజకవర్గాల్లో రేషన్‌కార్డుల పంపిణీ ప్రారంభమవుతుందని ప్రకటించారు. ఈ సమావేశంలో అజహరుద్దీన్‌, నవీన్‌ యాదవ్‌, బాబా ఫసీయుద్దీన్‌, సీఎన్‌ రెడ్డి, భవానీ శంకర్‌, గొంటి సాయినాథ్‌ యాదవ్‌, కిరణ్‌కుమార్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More : బీసీ రిజర్వేషన్ల కోసం బీఆర్ఎస్ దూకుడు

One thought on “జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో స్థానిక అభ్యర్థికే టికెట్ – మంత్రి

Comments are closed.