దగ్గుబాటి కుటుంబానికి నాంపల్లి కోర్టు సమన్లు

ఫిల్మ్‌నగర్‌లోని డెక్కన్ కిచెన్ కూల్చివేత కేసులో ఇవాళ (శుక్రవారం) నాంపల్లి కోర్టులో కీలక విచారణ జరగనుంది. ఈ కేసులో ఇప్పటికే నటుడు వెంకటేష్, నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు, హీరో రానాపై ఫిల్మ్‌నగర్ పోలీసులు కేసులు నమోదు చేశారు. డెక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేతపై విచారణకు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ, కోర్టుకు రాకపోవడంతో సురేష్ బాబు, వెంకటేష్, రానాలపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అందువల్ల నాంపల్లి కోర్టు ఈరోజు విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే, వారు కోర్టుకు హాజరవుతారా లేదా అన్న దానిపై సందిగ్ధత కొనసాగుతోంది.

ఈ వివాదం నందకుమార్‌కు చెందిన డెక్కన్ కిచెన్ హోటల్ స్థలంపై దగ్గుబాటి కుటుంబంతో ఏర్పడిన భూవివాదంతో మొదలైంది. సదరు స్థలంపై ఎటువంటి చర్యలకు దిగొద్దన్న హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా హోటల్‌ను పాక్షికంగా కూల్చివేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీంతో నందకుమార్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించగా, నాంపల్లి కోర్టు దగ్గుబాటి కుటుంబంపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని ఫిల్మ్‌నగర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో దుగ్గుబాటి కుటుంబ సభ్యులు నేడు కోర్టు విచారణకు హాజరు కావాల్సి ఉంది.

Read More : లండన్‌లో ఊర్వశి రౌతేలాకు షాకింగ్ అనుభవం

2 thoughts on “దగ్గుబాటి కుటుంబానికి నాంపల్లి కోర్టు సమన్లు

Comments are closed.