సీఎం కి హైకోర్టు ఊరట

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టు నుండి భారీ ఊరట లభించింది. గత సంవత్సరం మే 4న కొత్తగూడెంలో జరిగిన సభలో చేసిన ప్రసంగం బీజేపీ పరువుకు భంగం కలిగించిందంటూ ఆ పార్టీ నేత కాసం వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి బీజేపీ రిజర్వేషన్లను రద్దు చేస్తుందని వ్యాఖ్యానించారని ఆయన ఆరోపించారు.

ఈ ఫిర్యాదుతో ప్రజాప్రతినిధుల కోర్టులో కేసు నమోదు కాగా, కేసును కొట్టేయాలని రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారించిన హైకోర్టు, ప్రజాప్రతినిధుల కోర్టులో ఉన్న కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. దీంతో ఈ వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డికి పెద్ద ఊరట లభించింది.

Read More : దగ్గుబాటి కుటుంబానికి నాంపల్లి కోర్టు సమన్లు