ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా, ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. కీలక బ్యాట్స్‌మెన్ వరుసగా పెవిలియన్ చేరడంతో భారత్ బ్యాటింగ్ తడబడింది. టాస్ గెలిచి పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకున్న ఇంగ్లాండ్ పేసర్లు భారత్‌ను కట్టడి చేశారు. పలుమార్లు వర్షం అంతరాయం కలిగించిన కారణంగా తొలి రోజు 64 ఓవర్ల ఆట మాత్రమే జరగగలిగింది. కరుణ్ నాయర్ (52 నాటౌట్), సాయి సుదర్శన్ (38) జట్టును నిలబెట్టారు. ఇంగ్లాండ్ బౌలర్లలో గస్ అట్కిన్సన్ (2/31), జోష్ టంగ్ (2/47) చెరో రెండు వికెట్లు తీశారు. వోక్స్ ఒక వికెట్ పడగొట్టాడు.
తొలి మూడు టెస్టుల్లో విఫలమైన కరుణ్ నాయర్, నాలుగో టెస్టుకు దూరమైనా ఈ మ్యాచ్‌లో శార్దూల్ ఠాకూర్ స్థానంలో జట్టులోకి వచ్చి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మొదట సాయితో, ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ (19 నాటౌట్)తో కలిసి అజేయంగా ఆరో వికెట్‌కు 51 పరుగులు జోడించాడు.
ఇక కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అరుదైన ఘనత సాధించాడు. ఈ సిరీస్‌లో టాప్ స్కోరర్‌గా ఉన్న గిల్ (743 పరుగులు), ఐదో టెస్టులో 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్దే ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్‌గా నిలిచాడు. ఈ రికార్డు ఇంతకుముందు సునీల్ గవాస్కర్ (1978/79లో వెస్టిండీస్‌పై 732 పరుగులు) పేరిట ఉండేది. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ (2016/17లో ఇంగ్లాండ్‌పై 655 పరుగులు) మూడో స్థానంలో ఉన్నాడు.
Read More : హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌రావుకు సస్పెన్షన్ షాక్

One thought on “ఓవల్ టెస్టులో తొలి రోజు భారత్ 204/6”
Comments are closed.