రైల్వే అభివృద్ధి పేరిట కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ, మౌలిక సదుపాయాల పరిస్థితి ఇప్పటికీ ఆందోళనకరంగా ఉంది. ఇటీవలే “హై క్లాస్ రైల్వే స్టేషన్”గా గుర్తింపు పొందిన చల్లపల్లి రైల్వే స్టేషన్లో, కొద్ది వర్షానికే ప్లాట్‌ఫారంపైకి నీరు చేరి ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
ఇప్పటికే ఈ అంశంపై విమర్శలు కొనసాగుతుండగానే, మరో విషాదకర ఘటన గుంతకల్లులో చోటు చేసుకుంది. అక్కడి రైల్వే స్టేషన్‌లో పైకప్పు నుంచి పెచ్చులూడి మణికంఠ అనే బాలుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన ప్రయాణికుల భద్రతపై ఉన్న లోపాలను మరోసారి నెపానికి తీసుకొచ్చింది.
ప్రతి ఘటన తర్వాత అధికారులు విచారణ పేరుతో ప్రకటనలు జారీ చేస్తుంటారు. కానీ బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవడం మాత్రం అంతగా కనిపించదు. మహా అయితే ఒక నెల సస్పెన్షన్‌తో సరిపెట్టడం పరిపాటి అయిపోయింది. ఈ నేపథ్యంలో, ప్రజా ప్రాణాలకు ముప్పు కలిగే ఇలాంటి ఘటనలపై రైల్వే అధికారులు, కాంట్రాక్టర్లు పూర్తి బాధ్యత వహించే విధంగా చర్యలు తీసుకోవాలని జనం డిమాండ్ చేస్తున్నారు.
Read More : న్యాయస్థానంలో రెండవసారి హాజరైన సీఎం
