ట్రంప్‌కి నోబెల్ బహుమతి ఇవ్వాలంటూ అమెరికా డిమాండ్

అమెరికా మరోసారి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని డిమాండ్ చేసింది. థాయ్‌లాండ్–కంబోడియా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ప్రకటించిన నేపథ్యంలో వైట్‌హౌస్ స్పందించింది. ఈ మేరకు మీడియా సమావేశంలో వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివెట్ మాట్లాడుతూ, “నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ అన్ని విధాలా అర్హుడు” అని పేర్కొన్నారు. ఈజిప్ట్–ఇథియోపియా నుంచి తాజా థాయ్‌లాండ్–కంబోడియా వరకు సగటున నెలకు ఒక యుద్ధాన్ని నిలిపివేశారని కరోలిన్ తెలిపారు. దాడులు, ప్రతిదాడులతో రగిలిపోతున్న దేశాలను శాంతింపజేయడంలో ట్రంప్ కీలక పాత్ర పోషించారని వివరించారు. ఆయా దేశాధినేతలకు స్వయంగా ఫోన్ చేసి యుద్ధం ఆపాలని హెచ్చరించిన విషయాన్ని ఆమె వెల్లడించారు.

ట్రంప్ జోక్యంతోనే థాయ్‌లాండ్–కంబోడియా, ఇజ్రాయెల్–ఇరాన్, రువాండా–కాంగో, ఇండియా–పాకిస్థాన్, సెర్బియా–కొసావో, ఈజిప్ట్–ఇథియోపియా దేశాల మధ్య యుద్ధాలు ఆగాయని కరోలిన్ చెప్పారు. ఆయన జోక్యం లేకపోతే ఈ ఘర్షణలు భారీ ప్రాణ, ఆస్తి నష్టాలకు దారితీసేవని ఆమె పేర్కొన్నారు. ప్రపంచ దేశాల మధ్య ఉద్రిక్తతలను చల్లార్చి శాంతి నెలకొల్పిన ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాల్సిందేనని కరోలిన్ డిమాండ్ చేశారు.

Read More : “మాకు అభ్యంతరం లేదు, కానీ వారి ఆర్థిక వ్యవస్థకు నష్టమే”

One thought on “ట్రంప్‌కి నోబెల్ బహుమతి ఇవ్వాలంటూ అమెరికా డిమాండ్

Comments are closed.