బీహార్లోని సమస్తిపూర్ జిల్లాలో అమానుష సంఘటన వెలుగుచూసింది. అస్మిత అనే మహిళ తన ప్రియుడు హరిఓమ్తో కలిసి భర్త సోనును హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. పోలీసుల ప్రకారం, సోను తన భార్యను ప్రియుడితో అభ్యంతరకర స్థితిలో చూసిన తర్వాత ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఆ సమయంలో హరిఓమ్ సోనును గొంతు నులిమి చంపినట్టు అస్మిత ఒప్పుకున్నట్లు సమాచారం.
ఇంకా షాకింగ్ విషయంగా, హత్య జరిగిన తర్వాత భర్త మృతదేహం పక్కనే అస్మిత, హరిఓమ్ శారీరక సంబంధం పెట్టుకున్నారని దర్యాప్తులో బయటపడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.
Read More : శ్రీహరికోట నుంచి నేడు నిసార్ ఉపగ్రహం ప్రయోగం
