విమానాశ్రయంలో వరద నీరు, రహదారులు జలమయం

శుక్రవారం కోల్‌కతాలో భారీ వర్షాలు కురిశాయి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం పరిధిలోని ట్యాక్సీవేలపై వర్షపు నీరు నిలిచిపోయి విమాన రాకపోకలకు అంతరాయం కలిగించింది. ఉత్తర కోల్‌కతాలోని పలు ప్రాంతాలు నీటమునిగి, రహదారులు జలమయంగా మారాయి. మహమ్మద్ అలీ పార్క్, భాజపా కార్యాలయం, సెంట్రల్ అవెన్యూ పరిసరాలు వర్షపు నీటితో మునిగిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు మున్సిపల్ సిబ్బంది మోటర్ల సాయంతో రోడ్లపై నిలిచిన నీటిని తొలగించే పనులు వేగవంతం చేశారు.

Read More : ధన్ ఖడ్ కు వీడ్కోలు చెప్పడానికి కేంద్రం మౌనం వెనుకున్న కారణం?

One thought on “విమానాశ్రయంలో వరద నీరు, రహదారులు జలమయం

Comments are closed.