పిల్లల ఆధార్ వివరాలను ఐదేళ్లు దాటిన తర్వాత తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) సూచించింది. పిల్లలు ఏడేళ్లు దాటినా ఆధార్ అప్‌డేట్ చేయకపోతే, ఆయా కార్డులు డీయాక్టివ్ అయ్యే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఐదేళ్ల లోపు పిల్లలకు బయోమెట్రిక్ లేదా ఐరిస్ వివరాలు అవసరం లేకుండా, కేవలం ఫొటో తీసే ప్రక్రియతో ఆధార్ జారీ అవుతుంది. అయితే, ఐదు నుంచి ఏడేళ్ల మధ్య వయసు ఉన్న పిల్లలు తమ ఆధార్‌ను ఉచితంగా అప్‌డేట్ చేసుకోగలరని పేర్కొన్నారు. ఏడేళ్లు దాటిన పిల్లల ఆధార్ అప్‌డేట్‌కు మాత్రం రూ.100 ఫీజు వసూలు చేయనున్నట్లు యూఐడీఏఐ ప్రకటించింది.
Read More : విలక్షణ నటుడు కోట శ్రీనివాస్ రావు ఇక లేరు

One thought on “పిల్లల ఆధార్ అప్‌డేట్ తప్పనిసరి”
Comments are closed.