భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరియు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) సంయుక్తంగా రూపొందించిన భూ పరిశీలన ఉపగ్రహం ‘నిసార్’ ప్రయోగానికి సిద్ధమైంది. నేడు సాయంత్రం 5:40 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్16 రాకెట్‌తో ఈ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనున్నారు.
1.5 బిలియన్ డాలర్ల విలువైన ఈ ప్రతిష్ఠాత్మక మిషన్ భూమి ఉపరితల పరిశీలనలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. సహజ విపత్తులు, పర్యావరణ మార్పులు, మంచు కరిగింపు వంటి కీలక అంశాలను ట్రాక్ చేయడంలో ఈ ఉపగ్రహం ముఖ్యపాత్ర పోషించనుంది.
నిసార్ ప్రత్యేకతలు
నిసార్ (నాసా-ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్) ప్రాజెక్టు చారిత్రాత్మకంగా నిలవనుంది. భూమి ఉపరితలాన్ని డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపెర్చర్ రాడార్ — నాసా ఎల్-బ్యాండ్, ఇస్రో ఎస్-బ్యాండ్ —తో తొలిసారిగా పరిశీలించనుంది.
2,392 కిలోల బరువున్న ఈ ఉపగ్రహం 740 కిలోమీటర్ల ఎత్తులో సూర్య అనువర్తిత కక్ష్యలో తిరుగుతుంది. ప్రతి 12 రోజులకు భూమి, మంచుతో కప్పబడిన ఉపరితలాలను 242 కిలోమీటర్ల వెడల్పుతో అధిక రిజల్యూషన్ చిత్రాల రూపంలో స్కాన్ చేస్తుంది. ఇందుకోసం స్వీప్‌సార్ టెక్నాలజీని తొలిసారిగా వినియోగిస్తున్నారు.
Read More : రష్యాను 8.8 తీవ్రత భూకంపం కుదిపేసింది

3 thoughts on “శ్రీహరికోట నుంచి నేడు నిసార్ ఉపగ్రహం ప్రయోగం”
Comments are closed.