జమ్మూకశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్‌

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల చాపకింద నీరులా జరుగుతున్న కదలికలను అణచివేయడంలో భద్రతా బలగాలు మరోసారి విజయాన్ని సాధించాయి. తాజా సమాచారం ప్రకారం, కాశ్మీర్‌లోని పహల్గామ్‌ సమీప ప్రాంతంలో భద్రతా దళాలు ఉగ్రవాదులను గుర్తించి జరిపిన ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మట్టుబడ్డారు. భద్రతా వర్గాల సమాచారం ప్రకారం, ఈ ఆపరేషన్‌ ప్రత్యేక సమాచారంతో చేపట్టబడింది. ఇటీవల పహల్గామ్‌ ఉగ్రదాడిలో కీలక పాత్ర పోషించిన నిందితుడిని కూడా ఇటీవలే ఇండియన్‌ ఆర్మీ మట్టుబెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రాంతంలో మరికొన్ని ఉగ్ర ముఠాలు చురుకుగా ఉన్నట్లు ఇంటెలిజెన్స్‌ నివేదికలు వెల్లడించాయి.

భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని ముట్టడించి సుదీర్ఘ కాల్పుల అనంతరం ఉగ్రవాదులను హతమార్చాయి. ఆ ప్రాంతంలో ఇంకా కొందరు ఉగ్రవాదులు దాక్కున్నారనే అనుమానంతో సోదాలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనతో స్థానిక ప్రజల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో అదనపు భద్రతా బలగాలను మోహరించారు.

ప్రస్తుతం ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతుందని, హతులైన ఉగ్రవాదుల గుర్తింపు ప్రక్రియలో ఉందని అధికారులు తెలిపారు.

Read More : శ్రీహరికోట నుంచి నేడు నిసార్ ఉపగ్రహం ప్రయోగం