కర్నూలులో డీఆర్‌డీఓ మిసైల్ పరీక్ష విజయవంతం – సీఎం

కర్నూలులోని నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్ (NOAR)లో డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిన UAV-లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ మిసైల్ (ULPGM-V3)ను డ్రోన్‌ ద్వారా విజయవంతంగా పరీక్షించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలను అభినందించారు.

దేశ రక్షణ పర్యావరణ వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. “ULPGM-V3 విజయవంతమైన పరీక్ష మన దేశ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసే దిశలో ఒక కీలక ముందడుగు. ఇది ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తికి నిదర్శనం” అని చంద్రబాబు అన్నారు.

ఈ సందర్భంగా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన ట్వీట్‌కు ఆయన స్పందిస్తూ శాస్త్రవేత్తలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

Read More : గోవా గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు ప్రమాణస్వీకారం

One thought on “కర్నూలులో డీఆర్‌డీఓ మిసైల్ పరీక్ష విజయవంతం – సీఎం

Comments are closed.