పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభానికి ముందు, ప్రతిపక్ష ఇండియా కూటమి రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఇకపై ఇండియా కూటమిలో భాగం కాదని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ స్పష్టం చేశారు.
ఆన్లైన్ సమావేశానికి ముందు కీలక వ్యాఖ్యలు
శనివారం సాయంత్రం ఇండియా కూటమి పార్టీల నేతల ఆన్లైన్ సమావేశం జరగనున్న తరుణంలో, సంజయ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ – “ఇండియా కూటమితో మా పొత్తు 2024 లోక్‌సభ ఎన్నికల వరకే పరిమితం. ఢిల్లీ, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో మేమే ఒంటరిగా పోటీ చేశాం. అలాగే బిహార్, పంజాబ్, గుజరాత్ ఉప ఎన్నికల్లోనూ స్వతంత్రంగా బరిలోకి దిగాం. ప్రస్తుతం మా పార్టీ ఇండియా కూటమిలో భాగం కాదు” అని తేల్చిచెప్పారు.
కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు
ఇక ప్రతిపక్ష కూటమిలో కాంగ్రెస్ పార్టీని ఉద్దేశిస్తూ సంజయ్ సింగ్ విమర్శల వర్షం కురిపించారు. “ఇండియా కూటమికి కాంగ్రెస్ నాయకత్వం వహించగలదా?” అన్న సందేహాన్ని వ్యక్తం చేశారు.
ఈ వ్యాఖ్యలు ప్రతిపక్ష కూటమి భవిష్యత్తుపై ప్రశ్నార్ధకాలను తేవడంతో పాటు, రాష్ట్రాల వారీగా రాజకీయ వ్యూహాల్లో మార్పులకు దారితీయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read More : కీలక నిర్ణయం తీసుకున్న కర్ణాటక సీఎం సిద్దరామయ్య

One thought on “ఆప్ ఇండియా కూటమిలో భాగం కాదు”
Comments are closed.