తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న నలుగురు అన్యమత ఉద్యోగులు సస్పెండ్ కు గురయ్యారు. నాణ్యతా విభాగ డిప్యూటీ ఇంజినీర్ బి.ఎలిజర్, బర్డ్ ఆస్పత్రిలో స్టాఫ్ నర్సు ఎస్. రోసి, గ్రేడ్ -1 ఫార్మాసిస్ట్ ఎం. ప్రేమావతి, ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీలో విధులు నిర్వహిస్తున్న జి. అసుంతలను సస్పెండ్ చేస్తూ తితిదే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. వీరు క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నట్లు నిర్ధారణకు వచ్చిన అనంతరం తితిదే ఈ నిర్ణయం తీసుకుంది. హిందూ ధార్మిక సంస్థలో ఉంటూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని చర్యలు చేపట్టింది.
ప్రస్తుతం ఈ వ్యవహారం టీటీడీ పరిధిలో చర్చనీయాంశంగా మారింది.
Read More : భార్యపై అనుమానంతో భర్త హత్య, అనంతరం ఆత్మహత్య

3 thoughts on “తిరుమలలో టీటీడీ ఉద్యోగుల సస్పెన్షన్”
Comments are closed.