హరీష్ రావు ఢిల్లీలో న్యాయ నిపుణులతో భేటీ

Harish Rao wishes KCR a happy birthday

ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్ట్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ కీలక నేత, మాజీ నీటి పారుదల మంత్రి హరీష్ రావు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. అక్కడ న్యాయ నిపుణులను కలసి, బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో న్యాయపరంగా ముందుకు ఎలా సాగాలనే అంశంపై చర్చించనున్నారు. ఈ విషయంపై హరీష్ రావు ఇప్పటికే పలుమార్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో సమావేశమై చర్చలు జరిపినట్టు సమాచారం.

కాగా, రెండు రోజుల క్రితం హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై స్పందించారు. కాళేశ్వరం రాష్ట్రానికి గుండెకాయలాంటిదని, ఆ ప్రాజెక్ట్ కుప్పకూలిందంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు అసత్యమని విమర్శించారు. కాళేశ్వరం ద్వారా గతంలో లక్షల ఎకరాల్లో పంటలు పండాయని గుర్తుచేశారు. మూడు బ్యారేజీల్లో కేవలం ఒక బ్యారేజీకి చెందిన రెండు పిల్లర్లు మాత్రమే కుంగాయని, అలాంటప్పుడు మొత్తం ప్రాజెక్ట్ కూలిందని ఎలా చెప్పగలరని ప్రశ్నించారు.

Read More : ఫోన్ ట్యాపింగ్ కేసులో బండి సంజయ్(updates)